కోర్టు ఉద్యోగాల పేరుతో భారీ స్కాం..

by Kalyani |   ( Updated:2025-05-06 05:19:19.0  )
కోర్టు ఉద్యోగాల పేరుతో భారీ స్కాం..
X

దిశ, నల్లగొండ క్రైం: నల్లగొండ జిల్లా కోర్టులో ఉద్యోగాల పేరుతో భారీగా టోకరా జరిగిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోర్టులో కొన్ని కింది స్థాయి ఉద్యోగాలకు ప్రభుత్వం నుంచి దరఖాస్తులకు ఆహ్వానం పలకగా, మహిళా లాయర్ చొరవ చేసుకుని తాను ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించినట్లుగా పేర్కొంటున్నారు. ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు తీసుకుని, మొత్తం 40 మంది నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవడంతో బాధితులు ప్రతిరోజు కోర్టు ప్రాంగణంలో పడిగాపులు కాస్తున్నారు. వారు కోర్టులకు వచ్చిన విషయం తెలుసుకుని సదురు మహిళా లాయర్ కోర్టుకు హాజరు కావడం లేదని బాధితులు పేర్కొంటున్నారు. అయితే అంతా కలిసి నల్లగొండ జిల్లా ఎస్పీని కలిసేందుకు బాధితులు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది.



Next Story

Most Viewed