- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
భారీగా నల్లబెల్లం పట్టిక పట్టివేత
by Sumithra |

X
దిశ, మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ పట్టణంలో భారీగా నల్లబెల్లం, పట్టికను పట్టుకున్నట్లు ప్రోహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్‌పెక్టర్ రాఘవేందర్ గౌడ్ ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనివారం రాత్రి రోజువారీ గస్తీలో భాగంగా తనిఖీ చేస్తుండగా బైసాని సత్యనారాయణ ద్విచక్ర వాహనం పై రెండు బస్తాలలో బెల్లం, పట్టిక తీసుకేళ్తుండగా పట్టుబడ్డాడు. దీంతో అతనిని విచారించగా తన గౌడన్ నుంచి తరలిస్తున్నట్లు పేర్కొన్నాడు. గోదాంలో తనిఖీ చేయగా 800 కిలోల బెల్లం, 1400 కిలోల పట్టిక ఉన్నట్లు గుర్తించి వాటితో పాటు ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకొని సదరు వ్యక్తి పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆయన వెంట పర్వీన్, లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story