- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఎంత మందిని కంటావ్… నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలి నిర్వాకం

దిశ,నల్లగొండ: గత కొన్ని రోజులుగా అవినీతి,అక్రమాలతో వార్తల్లోకి ఎక్కుతున్న నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రిలో మైనార్టీ గర్భిణీ మహిళకు అనుకోని సంఘటన ఎదురైంది. డాక్టర్ అంటే కనిపించే దైవంతో సమానం. కానీ ఆమె అన్న మాటలకు గర్భిణీ మహిళ దుఃఖమయం అయ్యింది. ఒక ముస్లిం మైనార్టీ మహిళ డాక్టర్ వద్దకు వెళ్లి చెక్ చేపించుకుంటున్న సమయంలో డాక్టర్ తనని ఎన్నో కాన్పు అని అడగగా సదరు మహిళ ఐదో కాన్పు అని తెలిపింది.
నీకు సిగ్గు లేదా ఎంత మందిని కంటావ్ అని ఇష్టం ఉన్న రీతిలో డాక్టర్ అసభ్య పదజాలంతో బూతులు తిట్టిందని ఆమె తెలిపారు.ఈ సంఘటన తో ఆ మహిళ ఆసుపత్రిలో కన్నీరు మున్నీరు అయ్యింది. ఈ విషయం ఆమె భర్త, ఆమె దిశ తో తెలిపారు. ఆరోగ్యం కోసం ఆసుపత్రికి వస్తే ఇలాంటి అవమానకరంగా మాట్లాడటం ఏంటి అని అన్నారు. ఈ విషయం పై సదరు ఉన్నత అధికారులు ఆ డాక్టరు మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.