షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం

by Aamani |
షార్ట్ సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం
X

దిశ, భువనగిరి రూరల్: మండలంలోని నందనం గ్రామంలో షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... కడమంచి కర్ణాకర్, అతని భార్య, ఇద్దరు పిల్లలతో గ్రామానికి చెందిన వారి ఇంట్లో అద్దెకు నివాసం ఉంటున్నాడు. రోజువారీ క్రమంలో కర్ణాకర్, అతని భార్య పనికి వెళ్లగా, పిల్లలు స్కూల్ కి వెళ్ళిన తర్వాత మధ్యాహ్న సమయంలో పవర్ షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో పొగ వ్యాపించి మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న వస్తువులు మంటలకు పూర్తిగా కాలిపోయాయి. సుమారు మూడు లక్షల విలువగల ఆస్తి నష్టం జరిగినట్లు స్థానికులు తెలిపారు. బాధితుడు కర్ణాకర్ కుటుంబం రోడ్డున పడిందని, ఎవరైనా దాతలు ఆర్థిక సాయం చేయాలని పలువురు గ్రామస్తులు కోరుతున్నారు.



Next Story

Most Viewed