పంట పొలాల్లో హెలికాప్టర్ అత్యవసర ల్యాండ్..

by Aamani |
పంట పొలాల్లో హెలికాప్టర్ అత్యవసర ల్యాండ్..
X

దిశ, చిట్యాల : విజయవాడ నుంచి హకీంపేట వెళుతున్న ఆర్మీ హెలికాప్టర్ సాంకేతిక లోపం వల్ల చిట్యాల మండలంలోని వణిపాకల గ్రామంలో గల పంట పొలాల్లో బుధవారం అత్యవసరంగా ల్యాండ్ అయింది. ముగ్గురు ఆర్మీ అధికారులతో విజయవాడ నుంచి అకింపేట వెళుతున్న హెలికాప్టర్ సాంకేతిక లోపం ఏర్పడడంతో ఇది గమనించిన పైలెట్ హెలికాఫ్టర్ ను చిట్యాల మండలంలోని వల్లిపాకల గ్రామ పరిధిలో గల వ్యవసాయ పొలాల్లో సురక్షితంగా దింపాడు. దీంతో అక్కడ వ్యవసాయ పనులు చేసుకుంటున్న వ్యవసాయ కూలీలు, రైతులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అనంతరం విషయం తెలుసుకుని ఊపిరి పీల్చుకున్నారు. వెంటనే హైదరాబాద్ నుండి టెక్నీషియన్స్ ను పంపించి రిపేర్ చేస్తున్నారు.



Next Story