అర్ధరాత్రి భారీ వర్షం...కొట్టుకుపోయిన ధాన్యం

by Sridhar Babu |
అర్ధరాత్రి భారీ వర్షం...కొట్టుకుపోయిన ధాన్యం
X

దిశ,రాజాపేట : రాజాపేట ఐకేపీ సెంటర్లో రైతులు పోసిన ధాన్యం కుప్పలు బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కురిసిన భారీ వర్షంతో తడిసి కొట్టుకుపోయింది. గురువారం ఉదయం రైతులు వెళ్లి పరిస్థితిని చూసి ఆందోళన చెందారు. ధాన్యం కుప్పలు వర్షానికి కొట్టుకుపోయి నీటిలో మునగడాన్ని చూసి కంటనీరు పెట్టుకున్నారు. నిర్వహణ లోపంతో ధాన్యం కొనుగోలు

ఆలస్యంగా జరుగుతుందని, గన్నీ బ్యాగుల కొరత, రవాణాలో నిర్లక్ష్యం ఇతర కారణాలతో వర్షం వస్తే ధాన్యం తడిసిపోతుంది. ఆరుగాలం శ్రమించి అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి పంట విక్రయించే సమయంలో దినదినగండంగా మారిందని రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే భరించాలని, ఎలాంటి షరతులు లేకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేసి ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు.

Next Story