హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర ప్రారంభం..

by Disha Web Desk 11 |
హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్ర ప్రారంభం..
X

దిశ, వలిగొండ: రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మాణిక్ రావు ఠాక్రె పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాత్ సే హాత్ జోడో అభియాన్ పాదయాత్రను సోమవారం యాదాద్రి భువనగిరి కాంగ్రెస్ అధ్యక్షుడు కుంభం అనిల్ కుమార్ రెడ్డి వలిగొండ మండల పరిధి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి జెండా ఊపి ప్రారంభించారు. వలిగొండ పట్టణంలో ప్రతి ఇంటి ఇంటికి తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలకు వివరించారు. పాదయాత్ర అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నిర్వహించి ప్రజల మన్ననలు పొందారని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎయిమ్స్ ను మంజూరు చేసి నిర్మిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిది సంవత్సరాలు గడిచిన పూర్తిస్థాయి వైద్య సేవలు అందించడంలో విఫలమైందని విమర్శించారు.

స్థానిక ఎమ్మెల్యే నియోజకవర్గంలోని ఎయిమ్స్, సాగు నీటి కాలువలకు నిధులు మంజూరు చేయకుండా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి పల్లి, భీమ లింగం కాల్వల మరమ్మతులు చేపట్టి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్, జడ్పీటీసీ వాకిటి పద్మ, వైస్ ఎంపీపీ బాతరాజు ఉమా బాల నరసింహ, మండల కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, కంకల కిష్టయ్య, స్థానిక సర్పంచ్ బోళ్ల లలిత, ఎంపీటీసీలు కుందారపు యశోద, పల్లెర్ల భాగ్యమ్మ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed