water problem : గుక్కెడు నీటి కోసం.... బండెడు కష్టాలు

by Kalyani |
water problem : గుక్కెడు నీటి కోసం.... బండెడు కష్టాలు
X

దిశ,మాడుగులపల్లి : మాడుగులపల్లి మండల పరిధిలోని అభంగపురం గ్రామంలో ప్రజలు గుక్కెడు నీటి కోసం బండెడు కష్టాలు పడుతున్నారు. ఏళ్లు గడుస్తున్న గ్రామంలో తాగునీటి సమస్య పరిష్కారం కావడం లేదు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా మంచినీటి కోసం గ్రామంలోని పొలాల దగ్గర ఉన్న బోర్ల వద్ద బిందెలతో బారులు తీరుతున్నారు. గ్రామపంచాయతీ ట్రాక్టర్ తోని మంచినీటిని తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. పలుమార్లు నీటి కోసం అధికారులను పాలకులను కలిసి సమస్యను వివరించిన పరిష్కారం లభించకపోవడంతో చేసేదేమీ లేక ప్రజలు వారు తిప్పలు వారు పడుతున్నారు. గ్రామపంచాయతీలో మూడు బోర్లు ఉన్న నీరు ఇంకిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మిషన్ భగీరథ నీళ్లు అప్పుడప్పుడు వస్తుండడంతో అరకొర నీటితోనే గొంతులు తడుపుకుంటున్నారు. ఆ నీటి కోసం కూడా ఇంటిదగ్గర ఎవరో ఒకరు కాపలా ఉండాల్సి వస్తుందని, వానాకాలం సీజన్ మొదలు కావడంతో బోర్లు ఉన్న రైతులు కూడా మంచి నీటిని పట్టుకొనిఇవ్వడం లేదు అని, ఇప్పటికైనా అధికారులు స్పందించి మంచి నీటి సమస్యను పరిష్కరించాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.



Next Story