బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: దేవరకొండ ఎమ్మెల్యే

by Disha Web Desk 23 |
బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి: దేవరకొండ ఎమ్మెల్యే
X

దిశ: దేవరకొండ: బ్రాహ్మణుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని దేవరకొండ శాసన సభ్యులు,బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. సోమవారం దేవరకొండ పట్టణంలోని TTD కళ్యాణ మండపంలో పంచాంగని ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.ముఖ్యమంత్రి కేసీఆర్ నిరంతరం ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నారని అన్నారు. బ్రాహ్మణ పురోహితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు. రాష్ట్రంలోని 4,805 ఆలయాల ధూప, దీప, నైవేధ్యాల కోసం ప్రభుత్వం ప్రతి దేవాలయానికి రూ.6వేలు చొప్పున గౌరవ వేతనం చెల్లించి ఆదుకుంటుందని అన్నారు. దీనిలో రూ.2వేలు నిత్య పూజల కోసం, రూ.4 వేలు అర్చకుల కోసం ప్రభుత్వం కేటాయిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ఏర్పుల గోవింద్ యాదవ్,భాస్కర్ శర్మ,వైద్యుల కృష్ణమూర్తి,రవి ప్రసాద్,సురభి కృష్ణమూర్తి శర్మ,అజయ్ శర్మ,చంద్రశేఖర్ శర్మ,కురుమేటి వంశీకృష్ణ శర్మ,శ్రీనివాస్ శర్మ గాదె గిరిధర్,వెంకటేశ్వర్లు,గణేష్ శర్మ,తదితరులు పాల్గొన్నారు.


Next Story