కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శిగా గూని వెంకటయ్య

by Naresh N |
కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా కార్యదర్శిగా గూని వెంకటయ్య
X

దిశ, శాలిగౌరారం: శాలిగౌరారం మండలం గురజాల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గూని వెంకటయ్య కాంగ్రెస్ పార్టీ నల్లగొండ కార్యదర్శి గా నియమితులయ్యారు. శాలిగౌరారం మండలంలో గత 40 ఏండ్ల గా కాంగ్రెస్ పార్టీలో వివిధ హోదాల్లో పనిచేసి పార్టీ అభివృద్ధి కోసం క్రమశిక్షణ గల కార్యకర్తగా ఉన్నారు. అందుకుగాను తన సేవలను గుర్తించిన కాంగ్రెస్ పార్టీ గూని వెంకటయ్యను జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గా నియమిస్తూ జిల్లా అధ్యక్షులు కేతావత్ శంకర్ నాయక్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. బుధవారం రోజు నియామక పత్రాన్ని టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా గూని వెంకటయ్య మాట్లాడుతూ.. నా మీద నమ్మకం ఉంచి ఇంత పెద్ద బాధ్యత ను అప్పగించినందుకు పార్టీ అభివృద్ధి కోసం వచ్చే ఎన్నికల్లో శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, తన నియామకానికి సహకరించిన కాంగ్రెస్ పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

Next Story

Most Viewed