- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Garbage : కాలనీలో పేరుకుపోయిన చెత్తాచెదారం

దిశ ,తిరుమలగిరి: తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 8వ వార్డు అయిన అనంతారం గ్రామంలో బేడ బుడగ జంగాల కాలనీలో పారిశుధ్యం పేరుకుపోయింది. డ్రైనేజీ కాలువల్లో చెత్తాచెదారం చేరి..రోడ్డుపై మురికి నీరంతా వస్తుందని స్థానికులు వాపోతున్నారు. రోడ్డుపై నడవడానికి వీలు లేకుండా పోతుందని కాలనీవాసులు తెలిపారు. విష జ్వరాలు ప్రబలుతుంటే మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ..జంగాల కాలనీ పట్టించుకోవడంలేదని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన ఇటువైపు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఓట్లప్పుడు మా ఓట్లు కావాలి కానీ.. ఆపద సమయంలో ఆదుకునే నాధుడే లేడని జంగాల కాలనీవాసులు తెలిపారు. గత ప్రభుత్వం దళిత బంధు ఇచ్చి దళితులను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో.. తీసుకువచ్చిన దళిత బంధు పథకంలో సైతం నిరక్షరాస్యులైన మా అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని సగానికి సగం డబ్బులు దండుకున్నారని వాపోయారు.