గడప గడపకు ప్రజా బాట: పిల్లి రామరాజు

by Disha Web Desk 8 |
గడప గడపకు ప్రజా బాట: పిల్లి రామరాజు
X

దిశ,నల్లగొండ: నల్లగొండ నియోజకవర్గంలో ఇప్పటికే ప్రజలకు తనవంతు సహకారం చేస్తూ పేద ప్రజలను అదుకుంటూ తన వంతు మార్కుల ను నల్లగొండ లో సంపాదించుకున్న పిల్లి రామరాజు. నేటి నుండి గడప గడపకు ప్రజా బాట అనే నినాదంతో ప్రజలకి తాను చేరువయ్యేలా రాత్రుళ్ళు ప్రజల కోసం గ్రామాలలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు.ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి స్పందిస్తున్నట్లు సమాచారం. పిల్లి రామరాజు మాట్లాడుతూ ఉదయం పానగల్లు లో సాయంత్రం తిప్పర్తి మండలంలోని గోదారిగూడెం గ్రామంలో ఇంటి ఇంటికి తిరిగి వారి సమస్యలను అడిగి పరిష్కారం దిశ గా పనిచేస్తున్నట్లు,పేద ప్రజల సంక్షేమం ద్యేయంగా వారి కోసం ఎల్లపుడు అందుబాటులో ఉంటానని ఆయన దిశ తో తెలిపారు.

Next Story