తాండూర్ కందికి ఫుల్ డిమాండ్.. రైతుల పంటకు రికార్డు స్థాయి ధర

by Disha Web Desk 9 |
తాండూర్ కందికి ఫుల్ డిమాండ్.. రైతుల పంటకు రికార్డు స్థాయి ధర
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్టంలో ఈ ఏడాది రైతులు పండించిన కందులకు ఫుల్ డిమాండ్ వచ్చింది. రికార్డ్‌ స్థాయిలో ధర పలకడంతో రైతన్నలు లక్షాధికారులను చేసింది. రైతులు సాధారణంగా రైతులు లాభపడటం చాలా అరుదుగా జరుగుతుంది. ప్రభుత్వాలతో పాటు ప్రకృతి ప్రతికూల పరిస్థితుల కారణంగా రైతన్నలు నష్టపోతుంటారు. పంటలు బాగా పండిన ఏడాదేమో మద్దతు ధర లభించదు. ప్రభుత్వం మద్దతు ధర ఇచ్చిన ఏడాది కరువు, అకాల వర్షాలతో రైతన్నకు కష్టాలు వచ్చి పడుతుండటం చూస్తూనే వున్నాం. గతేడాది వర్షాభావం కారణంగా రైతులు చాలా నష్టపోయారు. అయితే అనూహ్యంగా ఈ ఏడాది కంది పంట పండించిన రైతుల పంట పండింది. రికార్డు స్థాయిలో భారీ ధర పలికింది.

రాష్ట్రంలోని అన్ని మార్కెట్‌లలోకెల్లా ఈఏడాది సూర్యాపేటలోనే రికార్డు ధర పలకింది. కంది పంటకు మంచి నాణ్యతగల కందులకు కింట్వా రూ.11,246 ధర చెల్లించి వ్యాపారులు కొనుగోలు చేసారు. ఇంత ధర వెచ్చించి కొనడం ఈ ఏడాదికి ఇదే అత్యధిక ధర అని మార్కెట్ వర్గాలు చెబుతున్నారు. పది క్వింటాళ్ల కందులు అమ్మిన రైతులు లక్షాధికారులు అవుతున్నారు. మంగళవారం రైతులు సూర్యాపేట మార్కెట్‌కు 50 క్వింటాళ్ల కందులు తీసుకురాగా.. క్వింటాకు గరిష్ఠ ధర రూ.11,246గా పలకటం విశేషం. కందులకు అత్యధిక ధర పలకటంతో అన్నదాతలు సంతోషం వ్యక్తం చేశారు. రైతులు నాణ్యమైన పంట ఉత్పత్తులు తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని మార్కెట్‌ అధికారులు రైతులను కోరుతున్నారు.

కాగా, తాండూరు కందిపప్పుకు ఈ ఏడాది మార్చిలో మంచి ధర పలికింది. నాణ్యత గల కందులను వ్యాపారులు రూ.11,007 ధర చెల్లించి కొనుగోలు చేశారు. నాసిరకంగా ఉన్న కందులకు రూ.8,811 చొప్పున, నాణ్యతకు కాస్త అటూ ఇటుగా ఉన్న కందులకు రూ.10,125 చొప్పున ధర చెల్లించిరైతుల నుంచి వ్యాపారులు కొనుగోలు చేశారు. ఇక కేంద్ర ప్రభుత్వం క్వింటాలు కందులకు రూ. 7 వేల మద్దతు ధర ప్రకటించింది. అయితే వ్యాపారులు మాత్రం మద్దతు ధర వద్ద రూ.1,811 నుంచి రూ.4,007 అధికంగా చెల్లించటం విశేషం. అయితే ఆ రికార్డు ధరను తాజాగా సూర్యాపేట మార్కెట్ యార్డులో వ్యాపారులు రికార్డు బ్రేక్ చేయడం విశేషం.

Next Story