పోలీస్, గ్రూప్ 4 అభ్యర్థులకు ఉచిత శిక్షణ : గుత్తా అమిత్ రెడ్డి

by Disha Web |
పోలీస్, గ్రూప్ 4 అభ్యర్థులకు ఉచిత శిక్షణ : గుత్తా అమిత్ రెడ్డి
X

దిశ, నల్లగొండ : పోలీస్, గ్రూప్ 4 అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు గుత్తా అమిత్ రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ ఆధ్వర్యంలో పోలీస్ పరీక్ష అభ్యర్థులకు దేహ దారుఢ్య పరీక్షల కోసం పది హేను వేల మందికి ప్రతి రోజూ హెల్తీ డైట్ ఇస్తూ మెయిన్స్ కు ఉచితంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అలాగే గ్రూప్-4 కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉచితంగా ఫోకస్ ఇనిస్టిట్యూట్ హైదరాబాద్ వారి ఫ్యాకల్టీతో క్లాసులు నిర్వహిస్తామని చెప్పారు. గ్రూప్-4 అభ్యర్థులు ఉచితంగా శిక్షణ పొందాలి అంటే గుత్తా వెంకట్ రెడ్డి మెమోరియల్ వారు నిర్వహించే స్క్రీనింగ్ టెస్టు ఈనెల 29వ తేదీన పోలీస్ ఆడిటోరియంలో ఉంటుందని, పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తే ఉచిత శిక్షణ, మెటీరియల్ అందజేస్తామని తెలిపారు. ఈ శిక్షణ 50 రోజుల పాటు ఉంటుందని, ఆన్లైన్లో తాము ఇచ్చిన లింకు https://forms.gle/HZguQkg1doNG1xvt7 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి రెండవ తేదీ నుండి శిక్షణ తరగతులు టీఎన్జీఓ భవన్ లో ప్రారంభం అవుతాయని, అలాగే పోలీసు అభ్యర్థులు మెయిన్స్ కి అర్హులైన వారు అడ్మిట్ కార్డు ద్వారా ఎలాంటి పరీక్ష లేకుండా తరగతులకు హాజరు కావచ్చు అని తెలిపారు. అలాగే నల్లగొండ నుండి అత్యధిక మంది నిరుద్యోగులను ఉద్యోగులుగా మార్చరడమే తన లక్ష్యం అని పేర్కొన్నారు. ఇతర సందేహాలకు శ్రీనివాస్-9550640324, రాం ప్రసాద్-7288800019 నంబర్లకు సంప్రదించాలని కోరారు.


Next Story