స్వామి వారి సన్నిధిలో మాజీ ఏపీ మంత్రులు

by Kalyani |
స్వామి వారి సన్నిధిలో మాజీ ఏపీ మంత్రులు
X

దిశ, యాదగిరిగుట్ట : ఆంధ్రప్రదేశ్ మంత్రులు వేరు వేరుగా పూజలు చేశారు. యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకుని, ఆలయంలో ఆండాళ్ అమ్మవారి ఉంజల్ సేవా, మహోత్సవం, స్వామి వారి జోడు సేవల్లో పాల్గొన్న ఏపీ మంత్రి రోజా,అంతకుముందు ఏపీ మంత్రి పిన్నెపి విశ్వరూప్ కుటుంబ సమేతంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు... యాదాద్రి శ్రీలక్ష్మీ నరసింహ స్వామి వారి సన్నిధిలో ఆండాళ్ అమ్మవారికి శుక్రవారం నాడు సాయంత్రం ఉంజల్ సేవను కన్నుల పండుగగా నిర్వహించారు.

ఆలయ అర్చకులు...మొదటగా ఆండాళ్ అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేపట్టారు...ఉయ్యాలపై అమ్మవారిని వివిధ రకాల పుష్పాలు, తులసిదళాలతో అలంకరించి ఆరాధించారు. పూజారులు హారతి నివేదించారు...సేవ పై అమ్మవారిని గర్భాలయములో కల్యాణ మండపంలో ఊరేగించారు...మేళతాళాలు, మంగళ వాయిద్యాలు వేద మంత్రాల నడుమ ఉంజల్ సేవ నిర్వహించి ఆండాళ్ అమ్మవారికి నివేదన సమర్పించారు. శుక్రవారం స్వామివారిని వివిధ కైంకర్యములు ద్వారా నిత్యాదాయం రూ:48,44,197ఆలయ ఖజానాకు సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.

Next Story