- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పత్తి గోదాములో అగ్ని ప్రమాదం..

దిశ, వలిగొండ : పత్తి గోదాములో మంటలు చెలరేగి పత్తి దగ్ధం ఐన ఘటన టేకుల సోమారం గ్రామంలో సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని సీసీఐ (fci )కి చెందిన పల్లవు కుమార్ పత్తి గోదాములో సోమవారం సాయంత్రం సమయంలో ప్రమాద వశాత్తు భారీ అగ్ని ప్రమాదం సంభవించి ఉవ్వెత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రమాదాన్ని సిబ్బంది గమనించి పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి, సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన భువనగిరి, రామన్నపేట, మోత్కూరు, యాదగిరిగుట్ట, ఆలేరు ప్రాంతాలనుండి మంటలు ఆర్పే యంత్రాలతో ఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. రాత్రి వరకు కూడా మంటలు అదుపు కాలేదు. అనంతరం సీసీఐ గోదాం జనరల్ మేనేజర్ జయకుమార్ సంఘటన స్థలానికి చేరుకొని సమీక్షించారు. ఈ ప్రమాద సమయంలో మంటలను ఆర్పేందుకు జిల్లా అగ్నిమాపక అధికారి జయకృష్ణ, చౌటుప్పల్ ఏసిపి మధుసూదన్ రెడ్డి,రామన్నపేట సీఐ వెంకటేశ్వర్లు, రెవెన్యూ సిబ్బంది, ఆర్ ఐ కరుణాకర్ రెడ్డి, స్థానిక ఎస్సై డి.మహేందర్ లాల్, ఫైర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.