- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
ఎట్టకేలకు ఎస్సారెస్పీ రెండో దశ నీటి విడుదల..
దిశ,తుంగతుర్తి:ఎట్టకేలకు శ్రీరామ్ సాగర్ రెండో దశ (ఎస్సారెస్పీ) జలాలు బుధవారం విడుదలయ్యాయి. జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని బయన్న వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ తో పాటు డిఈ సత్యనారాయణ,ఏఈ అమర్ కుమార్ లు లాంఛనంగా పూజలు జరిపి గేట్లు ఎత్తారు.ఈ మేరకు కాలువల ద్వారా సూర్యాపేట జిల్లా వైపు బిరా...బిరా మంటూ పరుగులు తీసిన జలాల్లో ఎమ్మెల్యే సామెల్ తో పాటు అధికారులు,వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వారంతా పసుపు-కుంకుమ,పూలు వెదజల్లి నమస్కరించారు.అనంతరం ఆ జలాలన్నీ తుంగతుర్తి నియోజకవర్గంలోని వెలిశాల (సూర్యాపేట జిల్లా ప్రారంభం) ప్రాంతం వద్ద సూర్యాపేట జిల్లాను తాకాయి.
అక్కడున్న 69, 70, 71 డిస్ట్రిబ్యూటర్ల ద్వారా తుంగతుర్తి నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల గుండా సూర్యాపేట జిల్లాకు చేరుతున్నాయి.తొలుత 500 క్యూసెక్కుల జలాలను విడుదల కాగా తదనంతరం దాన్ని వేయికి పెంచారు.69 కి 300,70కి 50,71కి 650 క్యూసెక్కుల చొప్పున నీటిని కేటాయింపులుగా చేసి పంపారు.అయితే నీళ్ల కెపాసిటీని క్రమక్రమంగా 1500 నుండి 1800 క్యూసెక్కుల వరకు పెంచనున్నారు.విడుదలైన జలాల ద్వారా తుంగతుర్తి,సూర్యాపేట,కోదాడ( ఈ నియోజకవర్గంలో కొంతవరకే) నియోజకవర్గాలలోని చెరువులు, కుంటలన్నింటిని నింపుతారు.
నీటి విడుదల ఎంతకాలం...?
సూర్యాపేట జిల్లా వైపు ఎస్సారెస్పీ రెండో దశ జలాల విడుదల ఎన్ని రోజుల పాటు కొనసాగుతుంది...? వారబందీ పద్ధతిలోనా....? లేక ప్రతిరోజు జరుగుతుందా...? అనేది అందరిలో నానుతున్న ప్రశ్నలు.ఎందుకంటే నీటి విడుదల జరిగిన పిదప కూడా దీనిపై ప్రభుత్వం నుండి ఎలాంటి షెడ్యూల్ ప్రకటన వెలువడలేదు.వాస్తవానికి షెడ్యూల్ ప్రకటన అనేది ప్రతి ఏటా ఖరీఫ్,రబీ సీజన్ లలో జరిగే నీటి విడుదలకు వారం రోజుల ముందే వస్తుంది.ఈ లెక్కన రైతాంగాన్ని కూడా దీనిపై ఒక అవగాహన కలుగుతుంది.గత రబీ సీజన్ వరకు కూడా నీటి విడుదలపై షెడ్యూల్ వెలువడింది.కానీ ఈసారి మాత్రం అలాంటిదేమీ లేకుండానే నీటి విడుదల జరిగింది.