జాతీయ అవార్డు గ్రహీతకు సన్మానం

by Gopi |
జాతీయ అవార్డు గ్రహీతకు సన్మానం
X

దిశ, దేవరకొండ: దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ కి జాతీయ అవార్డు వచ్చిన నేపథ్యంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ వి టిని తెలంగాణ సాహితీ సంస్కృతి అధ్యయన వేదిక (తెస్సా) ఆధ్వర్యంలో నియోజకవర్గ కవులు, సాహిత్య వేత్తలు, తెస్సా అధ్యక్షులు పర్చ వాసుదేవరావు, ప్రధాన కార్యదర్శి ఉడుత సలేశ్వర్ యాదవ్ సభ్యులతో కలిసి ఆదివారం దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ భవనం నందు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా (తెస్సా) అధ్యక్షులు పర్చా వాసుదేవరావు మాట్లాడుతూ తాము కూడా ఇకముందు స్పోర్ట్స్ అసోసియేషన్ బ్యానర్ కింద తమ వంతు సహాయంగా చేయూతనందిస్తామని ఆయన తెలిపారు. స్పోర్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్ వి టి మాట్లాడుతూ ఈ అవార్డు సభ్యుల సమిష్టి కృషితో పని చేసిన దానికి దేవరకొండ స్పోర్ట్స్ అసోసియేషన్ సభ్యులందరికీ చెందుతుందని వారన్నారు. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాహితీ సంస్కృతిక అధ్యయన వేదిక కార్యనిర్వహణ కార్యదర్శి రంజాన్ బేగ్, బిక్కుమల్ల లక్ష్మీనారాయణ, టైగర్ జీవా, మాడెం రాములు, నేతాల వెంకటేష్, గోగికార్ కిషన్ లాల్, చొల్లేటి భాస్కరాచారి, జానీ బాబా, పంతులాల్ నాయక్, డాన్స్ మాస్టర్స్ రాక్ స్టార్ రమేష్, జగన్, సలీం, భిక్షమయ్య, ఆంజనేయులు, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.

Next Story