మేఘకు ఆదిలోనే ఆటంకం.. పంపు హౌజ్ పనులను అడ్డుకున్న రైతులు

by Disha Web |
మేఘకు ఆదిలోనే ఆటంకం.. పంపు హౌజ్ పనులను అడ్డుకున్న రైతులు
X

దిశ, నేరేడుచర్ల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఎకరానికి నీరు అందించాలని లక్ష్యంతో కృష్ణా నదిపై సూర్యపేట జిల్లా పాలకవీడు మండలంలోని గుండెబోయిన గూడెం రెవెన్యూ శివారు 173.5 కోట్లతో 9 గ్రామలకు 5,650 ఎకరాలకు సాగు నీరు అందించేందుకు లిఫ్ట్‌తోపాటు పైపులైన్ల నిర్మాణం పనులను చేపట్టింది. ముందస్తుగా పంప్ హౌజ్ నిర్మాణం కోసం సర్వేనెంబర్ 65, 66 లో సుమారు 7 ఎకరాల్లో మేఘ సంస్థ పనులను చేపటింది. తమకు ఎటువంటి నష్టపరిహారం సంబంధించిన వివరాలను తెలియకుండానే పనులు చేపడుతుండటంతో రైతులు పంప్ హౌస్ వద్ద జరుగుతున్న పనులను గురువారం అడ్డుకున్నారు.

నష్టపరిహారం చెల్లించాకే పనులు చేపట్టండి..

తమ పంట భూములో తమకు తెలియకుండా మీషనరీల ద్వారా పనులు జరుగుతుంటే ఆ పనులను పలు సార్లు ఆపివేయాలని చెప్పినప్పటికీ పనులు ఆపకపోవడంతో రైతులు పనులను అడ్డగించారు. లిఫ్ట్ నిర్మాణం వలన తాము ఎంత భూమి కోల్పోతున్నాము. ఎకరానికి ఎంత నష్ట పరిహారం చెల్లిస్తున్నారని.. కాంట్రాక్టులు గానీ అధికారులు గానీ ముందుగా చెప్పకుండా తమ పంట పొలాల్లో ఎలా నిర్మాణ పనులు చేపడతారని మేగా సంస్థ ప్రతినిధులను, అదికారులను రైతులు ప్రశ్నించారు.


తమకు నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే పనులను చేపట్టాలని డిమాండ్ చేసి పనులను నిలిపివేశారు. తక్షణమే తమ పంట పొలాల్లోని నుండి తవ్వకాలు జరుపుతున్న మిషనరీని తీసి వేయాలని కోరారు. ప్రభుత్వం నుంచి నష్టపరిహారం చెల్లింపు పత్రాలు వచ్చిన తర్వాతనే పనులు చేపట్టాలని కాంట్రాక్టు అధికారులను కోరారు.

రైతు అనుమతులు లేకుండా పనులు చేయవద్దు.. తహశీల్దార్ శ్రీదేవి

భూములు కోల్పోతున్న రైతుల అనుమతి లేకుండా పనులు చేపట్టరాదని పాలకవీడు తహాశీల్దార్ శ్రీదేవి స్పష్టం చేశారు. మేఘ కంపెనీ వారు చేపట్టిన పనులను పరిశీలించేందుకు వెళ్లిన ఆమె.. రైతు అనుమతి లేనిదే పనులు జరపవద్దని రైతుల ఇష్టం మేరకు పనులు చేపట్టాలని మెగా సంస్థ ప్రతినిధులకు తహశీల్దార్ శ్రీదేవి ఆదేశించారు. అప్పటి వరకు పనులు నిలిపివేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీదేవి ఇరిగేషన్ ఏఈ కుమరయ్య, ఆర్‌ఐ జానీబాషా, సర్వేయర్ ఖాజా మొయినుద్దీన్, మెగా సంస్థ ప్రతినిధి రమణారెడ్డి, రైతులు పాల్గొన్నారు.

Telugu News , Latest Telugu News. Telangana News. Political News. Cinema News. Crime News. AP News. Web Stories. Latest Photo Galleries

Next Story

Most Viewed