- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
కోతుల బెడద నుంచి తప్పించుకునేందుకు వినూత్నంగా ఆలోచన చేసిన రైతు... నిజంగా సూపర్

దిశ, వెబ్ డెస్క్: ఆ ఊరిలో కోతుల బెడద చాలా ఉంది. ఇళ్లలో, పంటలల్లో చేరి అంతా నాశనం చేసేవీ. వాటితో ఆ ప్రాంతవాసులకు టెన్షన్. అయితే, కోతుల బెడద నుంచి తప్పించుకునేందుకు ఓ రైతు వినూత్నంగా ఆలోచించాడు. అనుకున్న విధంగా చేసి కోతులకు గజగజ వణుకు పుట్టించి అక్కడి నుంచి అవి పారిపోయేలా చేశాడు. ఇప్పుడు స్థానికంగా చర్చనీయాంశమైంది. వాహ్ నీ ఆలోచన బాగుందే అంటూ ఆ రైతుపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. సూర్యాపేట జిల్లా మోతె మండలం కొత్తగూడెంలో కోతుల బెడదతో ఆ ప్రాంత రైతులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. పంటపొలాలను సర్వ నాశనం చేస్తుండడంతో రోజూ ఆవేదన చెందేవారు. అయితే, ఓ రైతు పది ఎకరాల్లో పత్తి పంట వేశాడు. ఆ పత్తి చేనులోకి కోతులు వచ్చి సర్వనాశనం చేశాయి. ఈ క్రమంలో అతను తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. కోతుల బెడద నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలనే ఆలోచనలు చేసేవాడు. ఈ క్రమంలో ఆయనకు అతని మిత్రుడు ఓ సలహా ఇచ్చారు. అతను చెప్పిన విధంగానే గొరిల్లాను పోలిన డ్రెస్సు వేసుకుని రోజూ పంట పొలంలో వింత శబ్ధాలు చేస్తూ తిరిగాడు. దీంతో కోతులు అతడిని గొరిల్లా అనుకుని అక్కడి నుంచి పారిపోయాయి. అంతేకాదు.. పక్క పొలాల్లోకి కూడా కోతులు రావడం మానేశాయి. మొత్తంగా ఇప్పుడు అక్కడ కోతుల బెడద లేదు. దీంతో చుట్టు పక్కల రైతులు ఆ రైతును ప్రశంసిస్తూ నీ ఐడియా బాగుందంటూ మెచ్చుకుంటున్నారు.