- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
దిశ ఎఫెక్ట్ : పడిపోయిన బారీ కేడ్లను నిలబెట్టారు

దిశ, భూదాన్ పోచంపల్లి : పోలీసు అధికారులు స్పందించారు. బారీ కేడ్లను నిలబెట్టారు. భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జలాల్పురం గ్రామంలో గల చెరువు కట్ట పై ఉన్న మూలమలుపు ప్రమాదకరంగా ఉంది. ఇటీవల హైదరాబాదుకు చెందిన ఐదుగురు యువకులు మూలములుపు కనిపించక అదుపుతప్పి కారు చెరువులోకి దూసుకెల్లడంతో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. అప్పట్లో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసు అధికారులు బారికేడ్లను ఏర్పాటు చేశారు.
ఇటీవల ఈదురు గాలులతో కురిసిన వర్షాల కారణంగా అవి కింద పడ్డాయి. దీంతో ఈనెల 14న పడిపోయాయి.. పట్టించుకోండి.. అనే కథనం దిశ దినపత్రికలో ప్రచురితమైంది. వెంటనే స్పందించిన అధికారులు పడిపోయిన బారికేడ్లను మరల నిలబెట్టారు. దీంతో రోడ్డు ప్రమాదాలు జరగకుండా ముందుకొచ్చిన దిశ దినపత్రికకు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా చెరువు కట్ట పై ఇరువైపులా ఫెన్సింగ్ ను ఏర్పాటు చేసి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా శాశ్వతంగా సమస్యను పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.