నకిలీ నక్సలైట్ల అరెస్ట్

by Disha Web Desk 23 |
నకిలీ నక్సలైట్ల అరెస్ట్
X

దిశ, మిర్యాలగూడ : మావోయిస్టుల పేరుతో డబ్బులు వసూలు చేసేందుకు ప్లాన్​చేసిన ఇద్దరు నకిలీ నక్సలైట్లను సోమవారం మిర్యాలగూడ టూ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. మిర్యాలగూడ డీఎస్పీ వెంకటగిరి తెలిపిన వివరాల ప్రకారం..గతంలో జనశక్తి దళ సభ్యుడిగా పని చేసి పోలీస్ కోవర్ట్ గా మారిన జగిత్యాల జిల్లా కి చెందిన తిప్పిరెడ్డి సుదర్శన్ రెడ్డి భవన నిర్మాణ రంగంలో ఆర్థికంగా దెబ్బ తిన్నాడు. డబ్బు సంపాదనకు మరో వ్యక్తి సుంచు మల్లేష్ తో కలిసి మావోయిస్టుల పేరుతో బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూళ్లు చేస్తున్నాడు.

ఇదే క్రమంలో మిర్యాలగూడ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గౌరు శ్రీనివాస్ కు ఇటీవల సుదర్శన్ రెడ్డి ఫోన్ చేసి మావోయిస్టు పార్టీ దళ సభ్యుడిని అని తనకు రూ.5 లక్షల చందా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారికి భయపడిన శ్రీనివాస్ ఈ నెల 18న ఫోన్ పే ద్వారా రూ. 10వేల నగదు చెల్లించాడు. మిగిలిన డబ్బులు ఇవ్వకపోతే నీ కుటుంబ సభ్యులను చంపుతానని బెదిరించగా గౌరు శ్రీనివాస్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసుల సూచన మేరకు మిగతా డబ్బు తీసుకునేందుకు మిర్యాలగూడకు రావాలని చెప్పగా సోమవారం సుదర్శన్ రెడ్డి, మల్లేష్ లు పట్టణానికి వచ్చారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టు కి రిమాండ్ కి తరలించినట్లు డీఎస్పీ వెంకట గిరి పేర్కొన్నారు. సమావేశంలో సీఐ లు రాఘవేందర్, నర్సింహా రావు, ఎస్సై లు సైదిరెడ్డి, కృష్ణయ్య, సిబ్బంది లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, రామకృష్ణ తదితరులు ఉన్నారు.


Next Story

Most Viewed