స్వామివారి కొండపైన అభివృద్ధికి అందరూ సహకరించాలి: బీర్ల ఐలయ్య

by Kalyani |
స్వామివారి కొండపైన అభివృద్ధికి అందరూ సహకరించాలి: బీర్ల ఐలయ్య
X

దిశ, యాదగిరిగుట్ట : యాదగిరి కొండ పైన భక్తులకు మరిన్ని వసతులు కల్పించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం రోజున భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బీర్ల ఐలయ్య స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణకుంభం తో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పండితులచే వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామి వారి లడ్డు ప్రసాదం అందజేశారు.

అనంతరం ఆలయ కొండ పైన బస్ స్టాండ్ సమీపంలో సులబ్ కాంప్లెక్స్ ని ప్రారంభించారు. ఆ తర్వాత అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ఈ రివ్యూ సమావేశంలో ఆలయ అభివృద్ధి కోసం ఏర్పడుతున్న పలు సమస్యలను చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మాట్లాడుతూ…యాదగిరిగుట్ట అభివృద్ధి లో సహకరిస్తూ తిరుపతి తరహాలో యదగిరిగుట్టను అభివృద్ధి చేస్తామన్నారు.

యాదగిరిగుట్టలో స్వామి వారిని దూరం నుండి ఎక్కువ సేపు చూసే విధంగా అవకాశం కల్పించి ర్యాంప్ తో కూడిన క్యూ లైన్ ని ప్రారంభించామని తెలిపారు. అదేవిధంగా భక్తుల సౌకర్యార్థం నూతనంగా సులబ్ కాంప్లెక్స్ ను ప్రారంభించడం జరిగిందని, అన్నదాన సత్రం లో సుమారు 5000 మంది భోజనం చేసే విధంగా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యాదగిరిగుట్ట ఆలయాన్ని అభివృద్ధి చేసుకోవడంలో ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. యాదాద్రి కొండపైన అత్యంత ముఖ్యమైనది భక్తులకు టాయిలెట్ సౌకర్యం కల్పించడం అన్నారు.

సంస్కృతిక కార్యక్రమాలకు యాదగిరిగుట్ట ఆలయం నిలయమన్నారు. స్వామి వారి షటగోపం, ముఖ ద్వారా దర్శనం క్యూ లైన్లను ప్రారంభించడం భక్తులకు మంచి అనుభూతిని ఇస్తుందన్నారు. యాదగిరిగుట్ట కొండపైన ప్లాస్టిక్ ని పూర్తిస్థాయిలో నిషేధించామని అన్నారు. అదేవిధంగా జన్మదిన వేడుకల, సందర్భంగా,వివాహ మహోత్సవం సందర్భంగా, భక్తులు ఎవరైనా సరే అన్నదానాన్ని ఏర్పాటు చేయవచ్చని తెలిపారు.

అదేవిధంగా గిరిప్రదక్షణలో భాగంగా యధా రుషి మండపం ప్రహల్లాద మండపాన్ని నిర్మించినట్లు తెలిపారు. యాదగిరిగుట్ట భక్తుల సౌకర్యార్థం శాశ్వతంగా పార్కింగ్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అదేవిధంగా యాదాద్రి కొండపైన నూతనంగా కొన్ని షాపులను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆలేరు నియోజకవర్గంలో అసాంఘిక కార్యకలాపాలకు తావు లేకుండా ఎక్కడికక్కడ నిర్మూలిస్తామని అన్నారు. భువనగిరి పార్లమెంట్ సభ్యుడు చామల కిరణ్ కుమార్ రెడ్డి నిధుల్లో భాగంగా కోటి రూపాయలు ఆలేరు నియోజకవర్గానికి కేటాయించాలని బీర్ల ఐలయ్య కోరారు.

Advertisement

Next Story

Most Viewed