కాంగ్రెస్‌లో అధ్యక్షుల పంచాయితీ

by Dishaweb |
కాంగ్రెస్‌లో అధ్యక్షుల పంచాయితీ
X

దిశ,మర్రిగూడ: స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది మునుగోడు నియోజకవర్గంకాంగ్రెస్‌లో నేతల పంచాయతీ ఒకవైపు ఉండగా మండల పార్టీ అధ్యక్షులు పంచాయితీ తారస్థాయికి చేరుతుంది. క్యాడర్లో ఇప్పుడిప్పుడే కర్ణాటక లో కాంగ్రెస్ విజయ దుందుభి మోగించి టీఎస్ కాంగ్రెస్‌లో నయా జోష్లో కార్యకర్తలు ఉండగా నేతల పంచాయితీ తో కార్యకర్తలు అయోమయానికి గురవుతున్నారు .మునుగోడు బై ఎలక్షన్ లో సిట్టింగ్ స్థానాన్ని నాయకుల సమన్వయ లోపం తో అధికార పార్టీల డబ్బు పంపకంలో డిపాజిట్ కోల్పోయిన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న తరుణంలో నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరించడంతో కాంగ్రెస్ పార్టీ లో కిందిస్థాయి క్యాడర్ అసహనానికి గురవుతున్నారు.

బై ఎలక్షన్ లో టికెట్ ఉంది ఏమాత్రం క్యాడర్ను పట్టించుకోని కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి మరో మారు తన అనుచర గణంతో ఇష్టారాజ్యంగా పీసీసీ డిసిసి లకు సంబంధం లేకుండా అధ్యక్షుల నియామకం పార్టీ పదవులు కట్టబెడుతూ పార్టీని ఆ ప్రతిష్ట పాలు చేస్తున్నారని కార్యకర్తలు ఆరోపిస్తున్నారు . కాంగ్రెస్ అధిష్టానం రేవంత్ రెడ్డి హయాంలో మునుగోడు ఇంచార్జ్ గా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చల్లమల్ల కృష్ణారెడ్డికి అప్పజెప్పిన విషయం పాఠకులకు విదితమే. కృష్ణారెడ్డి డిసిసి అనుమతితో ఆరు మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను ప్రకటించి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను అమలు చేపిస్తూ కాంగ్రెస్ క్యాడర్లో జోష్ పెంచాడు.ఇటీవల సంస్థాన్ నారాయణపురంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చెల్లమల్ల కృష్ణారెడ్డి అధిష్టానం ఆదేశాలతోనే మునుగోడు కాంగ్రెస్ టికెట్ తనదేనని ప్రకటించడంతో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు నేత లు అభ్యంతరం వ్యక్తం చేశారు. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది .

సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవడానికి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో సీనియర్ల సమన్వయంతో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుమార్తె స్రవంతి కి టికెట్ కేటాయించారు . అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ,బీజేపీ పార్టీల డబ్బు పంపకంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ కోల్పోయింది . టికెట్ తెచ్చుకున్నంత ఉత్సాహం వచ్చిన తర్వాత కార్యకర్తలను కాపాడుకోలేకపోయారని పాల్వాయి స్రవంతి పై అధిష్టానం సీరియస్ గా ఉంది. బై ఎలక్షన్ లో టికెట్ ఆశించిన టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి చల్లమల్ల కృష్ణారెడ్డి మునుగోడు టికెట్లు వచ్చే ఎన్నికల్లో తనకి కేటాయిస్తుందని నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా ప్రచారం చేసుకుంటూ వాల్ రేటింగ్స్ కూడా పూర్తి చేశారు . డీసీసీ అధ్యక్షులు నియోజకవర్గ వ్యాప్తంగా అధ్యక్షులను ప్రకటించి నియామక పత్రాలు అందజేసినప్పటికీ కొందరు కావాలనే తానే అధ్యక్షుడు అని స్వయంగా ప్రకటించుకుంటూ పార్టీ పార్టీ కార్యక్రమాలు స్వతాగా చేస్తూ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారు. ఈ విషయమే అధిష్టానం సీరియస్ గా దృష్టి సారించకపోతే కాంగ్రెస్ పార్టీ కి మునుగోడులో కష్టకాలం తప్పదనిపిస్తుంది.

మొదటి నుంచి వాళ్ల రూటే సపరేటు

గత ఆరు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉన్న మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే కాంగ్రెస్ లేకపోతే ఇండిపెండెంట్ పోటీ చేస్తూ కార్యకర్తలను అయోమయానికి గురిచేసిన విషయం పాఠకులకు విధితమే. తండ్రి వారసత్వంతో రాజకీయాల్లో అడుగుపెట్టిన స్రవంతి ఆమె సైతం తండ్రి బాటలోనే టికెట్ ఇస్తే కాంగ్రెస్ లేకుంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తూ తన రాజకీయాన్ని ముందుకు సాగిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ రాజగోపాల్ రెడ్డికి కేటాయించడంతో ఆమె సపోర్ట్ చేయలేదు. అంతకు ముందు సైతం ఆమె ఇండిపెండెంట్గా పోటీ చేసిన విషయం పాఠకులకు విధితమే.

మునుగోడుపై అధిష్టానం మౌనం

మునుగోడు కాంగ్రెస్‌లోప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై అధిష్టానం మౌనం వహించడం పై సర్వత్రా కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. బై ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవడమే కాకుండా కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేక పోవడంతో నాయకులపై శ్రేణులు ఆగ్రహంతో ఉన్నారు. పార్టీ క్యాడర్ను కాపాడుకోలేని వ్యక్తులు ఉండటంవల్లే పార్టీ డిపాజిట్ కోల్పోయిందని కొందరు నాయకులు చేసిన కామెంట్స్ తో మునుగోడు కాంగ్రెస్‌లో రచ్చ స్టార్ట్ అయింది. ఇప్పుడిప్పుడే పార్టీ క్యాడర్లో కర్ణాటక జోష్ నెలకొని ఉండగా అధ్యక్షుల పంచాయతీతో కార్యకర్తలు ఆందోళనకు గురవుతున్నారు.మునుగోడు నియోజకవర్గంలోని మండల పార్టీ అధ్యక్షుల నియామకం పై స్పష్టమైన ప్రకటన చేయాల్సి ఉంది. అలాగే అధిష్టానం నియోజకవర్గ ఇన్చార్జిగా పేరును ప్రకటించకుంటే నేతలు ముందుకు సాగకపోగా కార్యకర్తల్లో నైరాషం నెలకొని బలపడుతున్న పార్టీ బలహీనపడే అవకాశాలు లేకపోలేదని కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిష్టానం ఇప్పటికైనా మునుగోడు పై మౌనం వీడాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నారు.

డీసీసీని సైతం వ్యతిరేకిస్తున్న స్రవంతి వర్గం

మునుగోడు బై ఎలక్షన్‌లో మండల పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెంట వెళ్ళగా డిసిసి అధ్యక్షుడు పిసిసి అధ్యక్షుని అనుమతితో 6 మండలాల అధ్యక్షులను నియమించారు. పార్టీ అభ్యర్థి ఎలక్షన్ లో డిపాజిట్ కోల్పోయినప్పటికీ పీసీసీ అధ్యక్షుల పిలుపుమేరకు కొత్త మండల పార్టీ అధ్యక్షులు పార్టీ కార్యక్రమాలు విజయవంతం చేస్తూ ముందుకు సాగుతు కాంగ్రెస్ శ్రేణుల్లో నయా జ్యూస్ పెంచారు . ఈ నేపథ్యంలో చల్ల మల్ల కృష్ణారెడ్డికి వ్యతిరేకంగా మర్రిగూడ మండల పార్టీ అధ్యక్షుడుగా ముద్దం నరసింహ గౌడ్ కొనసాగుతున్న నేపథ్యంలో పాల్వాయి వర్గం మరొక వ్యక్తిని నియమించి పార్టీ కార్యక్రమాలు చేస్తూ చల్లమల్లకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ లిస్తూ కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ అధిష్టానం దృష్టిసారించి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ శ్రేణులు కోరుతున్నారు.


Next Story

Most Viewed