చామల గెలుపునకు కృషి చేయాలి

by Disha Web Desk 15 |
చామల గెలుపునకు కృషి చేయాలి
X

దిశ, బొమ్మలరామారం : భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపునకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. బుధవారం మండలం కేంద్రంలో భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకై నిర్వహించిన బూత్ స్థాయి ముఖ్య నాయకులు సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అభయ హస్తం 6 గ్యారంటీ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు.

రాహుల్ గాంధీని ప్రధానిగా చేసేందుకు ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన ప్రజా సంక్షేమ పనులను ప్రజలకు వివరించి ఓట్లను అభ్యర్థించాలని కోరారు. భువనగిరి ఎంపీ కాంగ్రెస్ పార్టీ అధిక మెజార్టీతో గెలవడం ఖాయమన్నారు. కాంగ్రెస్ ప్రజా పాలనలో పేదలందరికీ న్యాయం జరుగుతుందన్నారు. సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీరాములు నాయక్ , అధ్యక్షుడు మల్లేష్, మాజీ ఎంపీపీ తిరుపతిరెడ్డి, రామిడి రాంరెడ్డి, పలు గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Next Story