ప్రజా ప్రతినిధుల సమస్యలు పట్టించుకోరా: దేవరకొండ ఎంపీపీ

by Disha Web Desk 23 |
ప్రజా ప్రతినిధుల సమస్యలు పట్టించుకోరా:  దేవరకొండ ఎంపీపీ
X

దిశ: దేవరకొండ:ప్రజా ప్రతినిధుల సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వ అధికారులు వివిధ గ్రామాలలో చేపట్టవలసిన పనులపట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని దేవరకొండ ఎంపీపీ నల్లగాస్ జాన్ యాదవ్ వివిధ శాఖల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం దేవరకొండ మండల సర్వసభ్య సమావేశంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, విద్యుత్ అధికారులు పనితీరు బాగాలేదని తెలపడంతో, ఎంపీపీ విద్యుత్ అధికారులను నిలదీశారు. నెలలు గడుస్తున్న ప్రతి సర్వసభ్య సమావేశంలో సర్పంచులు విద్యుత్ సమస్యల పరిష్కారానికి చర్యలు ఎందుకు చేపట్టడం లేదని ఆయన విద్యుత్ ఏఈని నిలదీశారు. అదే సమావేశం నుంచి నల్గొండ ఎస్సీ కి ఫోన్ ద్వారా సమాచారాన్ని అందించి అత్యవసరమున్న గ్రామపంచాయతీలో విద్యుత్ స్తంభాలు ఏర్పాటుచేసి కలెక్షన్లు ఇవ్వాలని తెలిపారు.

మన ఊరు మనబడి కార్యక్రమంలో ఎన్ని స్కూల్లు సాంక్షన్ అయినాయని , అందులో ఎన్ని కంప్లీట్ అయినాయని ఎంఈఓ ను అడుగుగా సరైన సమాధానం చెప్పకపోవడంతో విద్యాశాఖలో బడుల నిర్మాణ పనులు జరగడం లేదని అందుకు సంబంధించిన పూర్తిస్థాయి నివేదికలు ఎంఈఓ దగ్గర లేకపోవడంతో ఈ వివరాలు తీసుకుని సర్వసభ్య సమావేశానికి రావాలని తెలియదా అని ఎంఈఓ పై ఆగ్రహం వ్యక్తం చేశారు, సర్వసభ్య సమావేశానికి వ్యవసాయ శాఖ వెటర్నరీ ఎస్సీ వెల్ఫేర్ అధికారులు గై హాజరు కావడంతో వారికి మెమోలు జారీ చేసి ప్రభుత్వపరంగా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోకు సూచించారు. ప్రతి అధికారి బాధ్యతాయుతంగా ప్రజలకు జవాబుదారీగా పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శర్మ ,తహసీల్దార్ జివిఎన్ రాజు, సర్పంచులు ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed