నాగార్జున కళాశాల ముందు మరుగుదొడ్లు కట్టోద్దు

by Mahesh |   ( Updated:2024-03-11 04:36:17.0  )
నాగార్జున కళాశాల ముందు మరుగుదొడ్లు కట్టోద్దు
X

దిశ, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన నాగార్జున ప్రభుత్వ కళాశాల స్వయంప్రతిపత్తి కలిగి ఉంది. ఏటా వేలాది మంది గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు నల్లగొండలోని నడి బొడ్డున ఉన్న ఈ కళాశాలలో చదువుకుంటున్నారు. ఎంతో చరిత్ర కలిగిన కళాశాల ముందు నల్లగొండ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సులబ్ కాంప్లెక్స్ కట్టాలని నిర్ణయించారు. దానికి సంబంధించిన పిల్లర్ గుంతలను తీశారు. కలశాల ముందు ఈ మరుగుదొడ్లు నిర్మాణం చేయవద్దని విద్యార్థులు కోరుతున్నారు. ఈ మరుగుదొడ్ల నిర్మాణం కోసం కళాశాలకు కూడా ఎలాంటి సమాచారం లేనట్లు తెలిసింది.

కట్టిన కూల్చేస్తాం: నాగార్జున కళాశాల అల్యూమిని అసోసియేషన్

నాగార్జున కళశాలకు పూర్వ విద్యార్థులు నాగార్జున అల్యూమిని అసోసియేషన్ పేరుతో ఎన్నో ఏండ్లుగా వెన్నుదన్నుగా ఉంటూ పెద్ద అన్న పాత్ర పోషిస్తున్నారు. గతంలో కూడా ఇలానే కొందరు మరుగుదొడ్లు నిర్మిస్తాం అని బోరు వేయడానికి వస్తే అడ్డుకున్నారు. కళాశాల వాతావరణాన్ని పాడు చేయవద్దు అని అన్నారు. కాదు కూడదు అని అక్కడ మరుగుదొడ్లను కడితే మాత్రం కూల్చడం మాత్రం పక్కా అని దిశ తో తెలిపారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి కూడా ఫిర్యాదు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

కళాశాల ముందు మరుగుదొడ్లు కట్టవద్దని ఫిర్యాదు

నల్లగొండ నాగార్జున ప్రభుత్వ కలశాల ముందు నిర్మించాలని చూస్తున్న సులబ్ కాంప్లెక్స్‌ను కట్టకుండా.. నిర్మాణ ప్రతిపాధనను ఉపసంహరణ చేసుకోవాలని నల్లగొండ కలెక్టర్‌కి, అలాగే నల్లగొండ మున్సిపల్ చైర్మన్, నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌కి పిర్యాదు చేశామని తెలిపారు. కలశాల ముందు ఇలాంటి వాటిని కట్టొద్దు అని ప్రభుత్వాన్ని కోరారు.



Next Story

Most Viewed