- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
దిశ,ఎఫెక్ట్… కీచక టీచర్ల సస్పెండ్

దిశ,నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ కు కూతవేటు దూరంలో ఉన్నటువంటి డైట్ కళాశాలలో ఉన్నటువంటి డైట్ ప్రైమరీ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా చేస్తున్నటువంటి పోలే వెంకటయ్య, టీచర్ శ్యాంసుందర్ ఆ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థునుల తో అసభ్యకరంగా ప్రవర్తన చేసిన విషయం తెలిసిందే. దిశ పత్రికలో "దారి తప్పిన గురువులు" అనే కథనంతో అదే రోజు సమాజానికి తెలిసేలా చేయడం వల్ల ఈ విషయం నలుమూలల పాకింది.
వారి మీద నల్లగొండ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాధికారి భిక్షపతి వారిని సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థునుల విచారణ అనంతరం సమాచారం మేరకు వారిని సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి ఘటనలు ఎంతటి వారు చేసిన శిక్ష తప్పదు అని తెలిపారు. అలాగే ఎంఇఓ అరుంధతి ని దిశ సంప్రదించగా ఆ టీచర్లు ఇద్దరికి సస్పెన్షన్ లెటర్లు ఇవ్వడం జరిగింది అని తెలిపారు.