అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి

by Disha Web Desk 15 |
అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి
X

దిశ, మోత్కూరు : గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా డీఎల్పీఓ కె.యాదగిరి పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. మంగళవారం మోత్కూరు మండల పరిషత్ కార్యాలయంలో అడిషనల్ డీఆర్డిఓ నాగిరెడ్డి తో కలిసి అడ్డగూడూరు, గుండాల, మోత్కూరు మండలాల సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాలలో పెండింగ్లో ఉన్న పనులు, ఉపాధి హామీ పనులపై ఉపాధి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పన్నుల వసూలు, కంపోస్టు తయారీ, శ్మశాన వాటికల్లో మౌలిక వసతుల ఏర్పాటు, గ్రామాలలో స్వచ్ఛతా అంశాలు, సీసీ చార్జీలపై సమీక్ష చేస్తూ విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పంచాయతీ కార్యదర్శులను హెచ్చరించారు. తదుపరి సమీక్ష సమావేశం నాటికి పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్లాంటేషన్ మేనేజర్ ఇనాయత్ అలీ నర్సరీల ఏర్పాటు, బ్యాగ్ ఫిల్లింగ్ చేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ట్రైనింగ్ ఇచ్చారు. కార్యక్రమంలో అడ్డగూడూరు, గుండాల, మోత్కూరు మండలాల ఎంపీడీవో లు ఎల్. చంద్రమౌళి, శ్రీనివాస్, మోత్కూరు, అడ్డగూడూరు గుండాల, ఎంపీ ఓ లు రవూఫ్అలీ, ప్రేమలత, జనార్దన్ రెడ్డి , ఏపీవోలు కరుణాకర్, రవీందర్,మల్లేష్ మూడు మండలాల పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.



Next Story