నీటి ట్యాంకులో కోతుల మృతదేహాలు...అదే నీటిని తాగుతున్న ప్రజలు

by Sridhar Babu |
నీటి ట్యాంకులో కోతుల మృతదేహాలు...అదే నీటిని తాగుతున్న ప్రజలు
X

దిశ, నాగార్జునసాగర్ :నీటి ట్యాంకులో కోతుల మృతదేహాలు కుళ్లిపోగా అదే నీటిని ప్రజలు తాగుతున్న ఘటన సాగర్​లో చోటు చేసుకుంది. నందికొండ మున్సిపాలిటీ ఒకటవ వార్డు పరిధిలోని విజయ విహార్ పక్కనే ఉన్న వాటర్ ట్యాంక్ లో వానరాల కళేబరాలు దర్శనమిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా నీటి సరఫరా అవుతున్న అదే కలుషిత నీటిని వార్డు ప్రజలు తాగుతున్నారు.

వాటర్ ట్యాంకు పై రేకులు ఉన్న మూత తెరిచి ఉండడంతో లోపలికి వెళ్లిన కోతులు బయటికి రాలేక అందులోనే మృతి చెందాయి. సుమారు 30 కోతుల మృతదేహాలు నీటిలో తేలుతూ కనిపించడం కలకలం రేపింది. అయినా నీటి సరఫరా సిబ్బంది కనీసం అటువైపు కన్నెత్తి చూడలేదు. ట్యాంక్ శుద్ది చేయడం మరిచారా.. ప్రజల ఆరోగ్యాలతో చేలగాటమాడుతున్నారా అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు,సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.



Next Story

Most Viewed