దళితుల అభ్యున్నతికి దళిత బంధు : చిరుమర్తి లింగయ్య

by Disha Web Desk 15 |
దళితుల అభ్యున్నతికి దళిత బంధు : చిరుమర్తి లింగయ్య
X

దిశ నకిరేకల్ : దళితులు ఆర్థికంగా, సామాజికంగా అభ్యున్నతి చెందాలని సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని చేపట్టినట్లు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తెలిపారు. దళితుల పాలిట సీఎం కేసీఆర్ అభినవ అంబేద్కర్ అని కొనియాడారు. నార్కట్ పల్లి పట్టణంలో నల్లగొండ జెడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి తో కలిసి అంబేద్కర్ భవన నిర్మాణానికి మంగళవారం భూమి పూజ చేసి మాట్లాడారు. దేశంలోనే అతిపెద్దదైన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ లో నిర్మిస్తున్నారని తెలిపారు. అదే విధంగా నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు నామకరణ చేయడం మనందరి అదృష్టంగా పేర్కొన్నారు. పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరును నామకరణం చేయాలని డిమాండ్ చేశారు. అంతకుముందు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, ఎంపీపీ సూది రెడ్డి నరేందర్ రెడ్డి, ఎంపీటీసీ చిరుమర్తి యాదయ్య, పట్టణ అధ్యక్షులు దోసపాటి విష్ణుమూర్తి, ఉప సర్పంచ్ సిరిపంగి స్వామి, నాయకులు గుండె రవి, కొమ్ము యాదయ్య, లింగాల రాములు, అల్లే పరమేష్, సైదులు, తదితర నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed