- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
రాష్ట్రంలో ఉన్నది చేతల ప్రభుత్వమా.. కోతల ప్రభుత్వమా : జె.నరసింహారావు

దిశ, చిలుకూరు : రాష్ట్రంలో ఉన్నది చేతల ప్రభుత్వమా.. ఒట్టి కోతల ప్రభుత్వమా అని సీపీఎం సూర్యాపేట జిల్లా కమిటీ సభ్యుడు జె.నరసింహారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని కొండాపురంలో సోమవారం జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలంలో భూగర్భ జలాలు అడుగంటి బోర్లు, బావుల ఆధారంగా వేసిన వరి పొలాలు ఎండిపోతున్నాయని ఆయన అన్నారు.
'అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్' అని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వారబందీ పద్ధతిలోనైనా సాగర్ నీటిని విడుదల చేసి పొలాలను కాపాడాలని ఆయన కోరారు. లేని పక్షాన ప్రత్యక్ష ఆందోళనలకు పూనుకుంటామని నర్సింహారావు అన్నారు. సమావేశంలో సీపీఎం మండల కార్యదర్శి నాగటి రాములు, ఉపసర్పంచ్ యానాల వీరస్వామి, రైతు సంఘం మండల అధ్యక్ష, కార్యదర్శులు బుడిగం రామారావు, ఎగ్గడి లింగయ్య, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు రాంబాబు, లింగ మల్లయ్య, శ్రీకాంత్, గద్దపాటి కిరణ్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.