ఎదురు లేని శక్తి గా కాంగ్రెస్ పార్టీ : ఎమ్మెల్యే సామేల్

by Disha Web Desk 11 |
ఎదురు లేని శక్తి గా కాంగ్రెస్ పార్టీ : ఎమ్మెల్యే సామేల్
X

దిశ,శాలిగౌరారం :తెలంగాణ రాష్ట్రం లో కాంగ్రెస్ పార్టీ ఎదురు లేని శక్తిగా దూసుకుపోతుందని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఏ పార్టీ ఢీకొనలేదని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం నడుస్తుందని అన్నారు. ప్రధాని మోదీ ని ఈ ఎన్నికల్లో ఇంటికి పంపడం ఖాయమని ఆయన అన్నారు. శాలిగౌరారం మండలం లో బిఆర్ఎస్ పార్టీకి చెందిన శాలిగౌరారం ఎంపీటీసీ జోగు సైదమ్మ-శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు నూక కిరణ్ కుమార్ ,తాజా మాజీ సర్పంచ్ లు జటంగి శంకర్ (రామాంజపురం ), గౌర వీరయ్య (తిరుమలరాయిని గూడెం ),బండారు శంకర్(రామగిరి ), షేక్ ఖాషీంబి (జాలోనిగూడెం ) శ్రీరామదాసు రాజు, షేక్ జహంగీర్,నూక కిషోర్, జమ్ము అశోక్ తో పాటు మరో వంద మంది వివిధ గ్రామాల నుంచి ఎమ్మెల్యే మందుల సామేలు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సామేల్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథం లోకి తీసుకు వెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలంతా కాంగ్రెస్ పార్టీతోనే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అన్నేబోయిన సుధాకర్, మండల పార్టీ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి, చాడ సురేష్ రెడ్డి,చామల మహేందర్ రెడ్డి, నోముల జనార్దన్,బెల్లి వీరభద్రం, గూని వెంకటయ్య,వేముల గోపినాథ్,దేవరకొండ జయరాజ్, పడాల సైదులు, పడాల వెంకన్న, కట్లకుంట్ల రమేష్,దాసరి విజయ్ , తదితరులు ఉన్నారు.

Next Story