క్రిస్టియన్ల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి: ఎమ్మెల్యే

by Disha Web |
క్రిస్టియన్ల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి: ఎమ్మెల్యే
X

దిశ, మునుగోడు: క్రిస్టియన్ల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ ఎంతగానో కృషి చేస్తున్నారని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ తొలి చైర్మన్, మాజీ క్రిస్టియన్ ఎమ్మెల్సీ డి రాజేశ్వర్ రావు అన్నారు. మంగళవారం మునుగోడు మండలంలోని సింగారం గ్రామంలోని హౌజ్ ఆఫ్ ప్రేయర్ చర్చిలో మునుగోడు నియోజకవర్గ దైవ సేవకుల ఆత్మీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గృహ నిర్మాణo పథకంలో ప్రాధాన్యం ఇస్తానని హామీ ఇచ్చారు. ఉప ఎన్నికల తర్వాత నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలకు 571 కోట్ల నిధులు మంజూరురయ్యాయని, 180 కోట్ల పనులు పూర్తయ్యాయన్నారు. అనంతరం రాజేశ్వరరావు మాట్లాడుతూ.. క్రైస్తవుల ఆశీర్వాదం ఈ ప్రభుత్వానికి ఉంటుందన్నారు. నియోజకవర్గంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ కో అప్షన్ సభ్యులు జాన్ శాస్త్రి, బిషప్ నీల్సన్, కాలేపు శ్రీనివాస్, ఎంపిపి కర్నాటి స్వామి, బిఆరెస్ జిల్లా నాయకులు లపంగి నర్సింహ, మండల నాయకులు పోలగొని సైదులు, ఆర్.ప్రభాకర్, ఎం.సాగర్, అబ్రహం, ఎజ్రా, వరికుప్పల నర్సింహ, అన్ని మండలాల పాస్టర్లు, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed