రైతులను మోసం చేస్తున్న CM KCR : బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి

by Shiva |
రైతులను మోసం చేస్తున్న CM KCR : బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి
X

దిశ, చౌటుప్పల్: రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తామని చెప్పి సీఎం కేసీఆర్ మోసం చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం రాత్రి చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రాల్లోని 35, 36 శక్తి కేంద్ర స్ట్రీట్ కార్నర్ సమావేశాన్ని ఇన్ చార్జి గుజ్జుల సురేందర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు పండించే వరి పంటను పూర్తిగా తానే కొనుగోలు చేసి డబ్బు చెల్లిస్తున్నానని చెబుతూ కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నాడని తెలిపారు.

ప్రత్యేక రాష్ట్రం కొట్లాడి సాధించుకుంది నీళ్లు, నిధులు, నియామకాల కోసమని అది మర్చిపోయి రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ తాగుబోతుల తెలంగాణగా మార్చేశాడని ఎద్దేవా చేశారు. నీళ్లు తన ఫామ్ హౌస్ కు, నిధులు తన బంధువులకు, నియామకాలు తన అనుచరులకు కట్టబెడుతూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడని ఆరోపించారు. ఈ సమావేశంలో బీజేపీ మునిసిపాలిటీ అధ్యక్షుడు ఉడుగు వెంకటేశం గౌడ్, రాష్ట్ర నాయకులు దోనూరు వీరారెడ్డి, తడక సురేఖ, రమణగోని శంకర్, మారగోని గణేష్, మలిగే శ్రీశైలం, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed