సీఐ రాఘవ రావు ని సస్పెండ్ చేయాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు

by Disha Web Desk 23 |
సీఐ రాఘవ రావు ని సస్పెండ్ చేయాలి: బీజేపీ జిల్లా అధ్యక్షుడు
X

దిశ,నల్లగొండ: నల్లగొండలో ఏబీవీపీ నాయకురాలు హరిత గ్రూప్ వన్ పరీక్ష పత్రాల లీకులు విషయమై నల్లగొండ కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతున్న క్రమంలో సీఐ రాఘవరావు అనాగరికంగా మహిళ అని చూడకుండా చేయి పట్టుకొని లాగడాన్ని తీవ్రంగా ఖండించి దిశ కథనానికి స్పందించి నల్లగొండ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి నల్లగొండ ఎస్పీ కి ఫిర్యాదు చేసారు.వారు మాట్లాడుతూ అమర్యాదగా మహిళ పట్ల ప్రవర్తించిన సీఐ రాఘవ రావు మీద చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి అని అలాగే వెంటనే సస్పెండ్ చేయాలని మహిళల దినోత్సవం అయ్యి పట్టుమని పది రోజులు కాకముందే ఇలా జరగడం అది కలెక్టర్ కార్యాలయం ముందు అలాగే అక్కడే ఉన్న మహిళ పోలీసు స్టేషన్ ఉన్న మహిళలు ఉన్న ఆయన అలా ప్రవర్తించడం హేయమైన చర్యగా తెలిపారు.ఈ విషయమై చర్యలు తీసుకోకుంటే జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతామని తెలిపారు.మహిళ కమిషన్ ను కూడా కలిసి పిర్యాదు చేస్తాం అని దిశ తో అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్,బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి నిమ్మల రాజశేఖర్ రెడ్డి,బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్,కంచర్ల సాగర్ రెడ్డి,ఎస్కే పాషా,మంగళపల్లి కిషన్,మహేష్ పాల్గొన్నారు.


Next Story

Most Viewed