- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
పెద్దగట్టు జాతరలో చిన్నారుల భిక్షాటన
by Naveena |

X
దిశ ,చివ్వేంల :నిరుపేద చిన్నారులు భిక్షాటన చేస్తున్న సంఘటన రాష్ట్రంలో రెండో అతిపెద్ద జాతరైనటువంటి శ్రీ పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతరలో కనిపించింది. వచ్చే భక్తులు దేవుని దర్శనం కోసం గుట్ట పైకి వెళ్ళేటప్పుడు మండుటెండలలో చిన్నారులు భిక్షాటన చేస్తున్న దృశ్యం భక్తుల మనస్సును కలచి వేస్తుంది.అధికారులు వారికి కేటాయించిన ప్రాంతాలలో టెంట్ నీడన కూర్చుంటే నిరుపేద చిన్నారులు మాత్రం మండుటెండలో కూర్చొని బిక్షాటన చేస్తున్నారు.దేవుని దర్శనం చేసుకొని వచ్చే భక్తులు వారిని చూసిన జాలిపడి వారికి డబ్బులు ఇస్తున్నారు. పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర కోసం జిల్లాలోని అన్ని శాఖల అధికారులు వస్తున్నారు. బిక్షాటన చేస్తున్న నిరుపేద చిన్నారులను సంబంధిత అధికారులు వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని భక్తులు కోరుకుంటున్నారు.
Next Story