- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చెరువును తలపిస్తున్న చండూరు రోడ్డు..

దిశ, చండూరు: వర్షాకాలం ప్రారంభం తో పాటే వాహనదారులకు ప్రయాణ తిప్పలు మొదలయ్యాయి. వర్షం వచ్చిందంటే చండూరు మున్సిపాలిటీలో ప్రధాన రహదారి వెంబడి వర్షం నీరు నిలిచి చెరువును తలపిస్తు ప్రమాదాలకు నిలయంగా మారుతుంది. కస్తూర్బా పాఠశాల ముందు రోడ్డు పై నీరు ఎక్కువ ఎత్తులో నిలిచిపోవడంతో వాహనదారులు ఇతర మార్గాల ద్వారా రాకపోకలు సాగిస్తున్నారు. ఇక్కడ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా రోడ్డుకు ఇరువైపులా నిర్మించిన డ్రైనేజీ పనులు అసంపూర్తిగా వదిలేశారు. డ్రైనేజీలో నిలిచిన మురుగు నీరుతో వచ్చే దుర్గందం, దోమలతో ప్రజలు ఇప్పటికే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దీనికి తోడు ఎగువ నుంచి వచ్చిన వర్షపు నీరు ఎటు పోలేక రోడ్డుపైనే ఎక్కువ మొత్తంలో నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన రహదారి కావటంతో రోజు ఎక్కువ మొత్తంలో వాహనాల రాకపోకలు జరుగుతుంటాయి. వర్షాకాలం ప్రారంభంలోనే ఇలా ఉంటే ముందు ముందు ఇంకా ఎంత ఇబ్బంది పడలో అని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు పనులు నత్తనడకన సాగుతుండటం పట్ల ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూరి చేయాలని అప్పటిలోగా వర్షం నీరు పోవడానికి అధికారులు తాత్కాలిక చర్యలు చేపట్టాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.