- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
చందుపట్ల ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెండ్

దిశ, చివ్వెంల : మండలంలోని బండమీది చందుపట్ల గ్రామానికి చెందిన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ గుయ్యం రవి సస్పెండ్ అయ్యారు. డిఆర్డిఏ పిడి మధుసూదనరాజు ఆదేశాలతో ఈనెల 4 న విధుల నుంచి తొలగించినట్టు ఎంపీడీఓ చక్రాల సంతోష్ కుమార్ వెల్లడించారు. ఉపాధి హామీ పనుల్లో పనికి వెళ్ళని వారికి హాజర్లు వేస్తున్నారని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. అప్పటి కలెక్టర్ వెంకట్రావు ఆదేశాలతో సూర్యాపేట జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ విచారణ చేపట్టారు. ఉపాధి పనుల్లో అక్రమాలు జరిగాయని, రోజుకు పనికి వెళ్ళని వారికి హైదరాబాద్, హుజుర్ నగర్, కోదాడ, ఇతర ప్రాంతాల్లో ఉన్న వారికి హాజరు వేసినట్లు రుజువు కావడంతో నివేదిక తయారు చేసి కలెక్టర్, పీడీకి అందజేశారు. ప్రస్తుతం జరుగుతున్న ఉపాధి హామీ సామాజిక తనిఖీలో భాగంగా తనిఖీ బృందానికి గతంలో జరిగిన పనులను చూపెడుతున్నారని, ఫీల్డ్ అసిస్టెంట్ గుయ్యం రవి ఈ నెల 4 నుంచి విధుల్లో లేరని ఎంపీడీఓ పేర్కొన్నారు.