రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు..

by Sumithra |
రెచ్చిపోతున్న చైన్ స్నాచర్లు..
X

దిశ, కోదాడ : పట్టణం నడిబొడ్డున ఉదయం సమయంలో ఓ మహిళ మెడలో గొలుసు చోరీ అయిన సంఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని నయనగర్ లో నల్లమోతు రామా భర్త దుర్గారావు ఆరుబయట గోరింటాకు కోస్తుంది. గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు ద్విచక్ర వాహనం పై వచ్చారు. ఒక వ్యక్తి దిగి చుట్టుపక్కల గమనించి రామా మెడలో ఆరు తులాల బంగారపు చైన్ లాక్కొని పరారయ్యారు. పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించినా దొరకలేదని బాధితురాలు పేర్కొన్నారు.

చైన్స్ స్నాచింగ్ వరుస సంఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పట్టణ ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఇల్లు విడిచి బంధువుల ఇంటికి కానీ శుభకార్యాలకు కూడా వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని, ఇప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అనే తేడా లేకుండా ఏ సమయంలో పడితే ఆ సమయంలో చైన్ స్నాచింగ్ దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయని అధికారులు స్పందించి పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజల కోరుతున్నారు.



Next Story

Most Viewed