- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
నల్లగొండలో చైన్ స్నాచర్ హల్చల్
by Kalyani |

X
దిశ, నల్లగొండ: నల్లగొండ పట్టణంలో చైన్ స్నాచర్ హల్చల్ చేస్తూ ఓ మహిళ మెడలో 2 తులాల బంగారు గొలుసును చోరీ చేశాడు. సీఐ ఏమిరెడ్డి రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం… మారుతీ నగర్ కి చెందిన గడ్డం కమలమ్మ ముషంపల్లి రోడ్డులో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె వెంట నడుచుకుంటూ వచ్చి మెడలో ఉన్న రెండు తులాల బంగారు గొలుసును లాక్కొని వెళ్ళిపోయాడు. వెంటనే తేరుకున్న మహిళ అరుపులు చేయగా దొంగ పారిపోయాడని ఆమె ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు వన్ టౌన్ లో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు అలాగే సీసీ ఫుటేజిని పరిశీలిస్తున్నట్లు ఆయన దిశ తో తెలిపారు. ఒంటరిగా వెళ్లే మహిళలు మీ వెంట ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు వస్తున్నట్లు అనుమానం వస్తే డయల్ 100 కి కాల్ చేయాలని, అలాగే మీ ప్రాంతంలో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే తెలపాలని కోరారు.
Next Story