చండూరులో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు..

by Disha Web Desk 20 |
చండూరులో కాంగ్రెస్ శ్రేణుల సంబరాలు..
X

దిశ, చండూరు : నేడు వెలువడుతున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజక వర్గ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతుండటంతో చండూరులో పార్టీ కార్యకర్తలు బాణా సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు. ఇప్పటికే ఇరవై వేల మెజార్టీ రాగా ఇంకా నాలుగు మండలాల లెక్కింపు జరగాల్సివుంది. దీంతో భారీ మెజార్టీ రానుందని కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కలిమికొండ జనార్దన్, పున్న ధర్మేందర్, ఇరిగి వెంకటేశం, బిమనపల్లి శేఖర్, బూతరాజు వేణు, శ్రీకాంత్, ముజ్జు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed