కారు, లారీ ఢీ.... నలుగురికి గాయాలు

by Disha Web Desk 22 |
కారు, లారీ ఢీ.... నలుగురికి గాయాలు
X

దిశ, గరిడేపల్లి: లారీ, కారు ఎదురెదురుగా ఢీ కొని నలుగురు వ్యక్తులకు గాయాలు అయ్యాయి. ఈ సంఘటన శనివారం సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని రాయిని గూడెం గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మిర్యాలగూడ కు చెందిన ధీరావత్ సుధాన్ కుటుంబ సభ్యులు హుజుర్ నగర్ పట్టణంలోని బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లి సాయంత్రం మిర్యాలగూడలోని తమ ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో రాయిని గూడెం గ్రామ శివారు వద్దకు చేరుకోగానే మిర్యాలగూడ నుంచి హుజుర్ నగర్ వైపు వెళ్తున్న లారీ, కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులకు గాయాలయ్యాయి. ధీరావత్ సుధాన్, మంచ నాయక్ లకు తీవ్రంగా గాయాలు కాగా వారిని వెంటనే హుజుర్ నగర్ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన విషయ మై ఎలాంటి కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed