BREAKING: యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచలనం.. భర్త అంత్యక్రియలకు అడ్డుపడిన భార్య

by Shiva Kumar |
BREAKING: యాదాద్రి భువనగిరి జిల్లాలో సంచలనం.. భర్త అంత్యక్రియలకు అడ్డుపడిన భార్య
X

దిశ, వెబ్‌డెస్క్: భర్త అంత్యక్రియలకు భార్య అడ్డుపడిన అమానవీయ ఘటన యాద్రాద్రి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని పంతంగి గ్రామంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన సి. హనుమంత్ రెడ్డి హైదరాబాద్‌లో అద్దెకు ఉంటూ ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే ఆయన తండ్రి నర్సిరెడ్డి పేరిట గ్రామంలో 7.24 ఎకరాల భూమి ఉంది. ప్రభుత్వ ఉద్యోగిగా రిటైర్ అయిన నర్సిరెడ్డి మూడేళ్ల క్రితం వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ క్రమంలోనే అసులు ట్విస్ట్ చోటుచేసుకుంది. తండ్రి ఆస్తిలో భాగం ఇవ్వాలని కోరుతూ.. హనుమంత్ రెడ్డి తోబుట్టువులు ఇటీవలే కోర్టుకెక్కారు. మరోవైపు సోదరుడు కరుణాకర్‌రెడ్డితో హనుమంతరెడ్డికి వివాదం కొనసాగుతోంది. దీంతో తీవ్ర ఒత్తిడకి గురైన హనుమంత్ రెడ్డి శనివారం రాత్రి స్వగ్రామానికి వచ్చి ఇంట్లో ఉరేసుకుని బలవన్మరాణికి పాల్పడ్డాడు.

గ్రామస్థుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృదదేహాన్ని పోస్టు‌మార్టం నిమిత్తం చౌటుప్పల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో తన భర్త చనిపోవడానికి కారణం ఆడపడుచులు, మరదే కారణమని హనుమంతరెడ్డి భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో వారి ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వదిన తమపై పెట్టిన కేసును విత్‌డ్రా చేసుకోవాలని గ్రామస్థులతో స్వప్నపై ఒత్తిడి తెచ్చారు. కాగా, ఆస్తి విషయమై కోర్టులో ఉన్న కేసును విత్‌డ్రా చేసుకుంటేనే భర్త అంత్యక్రియలు నిర్వహిస్తామని హనుమంతరెడ్డి భార్య బంధువులు తేల్చి చెప్పడంతో మూడు రోజులుగా మార్చూరీలోనే మృతదేహం ఉంది. అయితే, ఆస్తి కోసం సోంత భార్యే అంత్యక్రియలను చేయనివ్వకపోవడం ఏంటని గ్రామస్థులు, పోలీసులు ఈ పరిణామాన్ని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు.



Next Story

Most Viewed