దసరా శుభాకాంక్షల ఫ్లెక్సీలను తొలగించడం అవివేకం!

by Dishanational1 |
దసరా శుభాకాంక్షల ఫ్లెక్సీలను తొలగించడం అవివేకం!
X

దిశ, దేవరకొండ: మునుగోడు ఎన్నికల కోడ్ ఉన్నందున ఫ్లెక్సీలను తొలగించామని సంబంధిత అధికారులు చెప్పడం ఎంతవరకు సమంజసమని దేవరకొండ బీజేపీ రాష్ట్ర నాయకులు నీల రవికుమార్ అన్నారు. దసరా పండుగకు శుభాకాంక్షలు తెలియజేసే ఫ్లెక్సీలను ఉద్దేశపూర్వకంగానే మున్సిపల్ అధికారులు తొలగించారని నల్లగొండలో లేని ఎన్నికల కోడ్ దేవరకొండలో ఎలా వర్తిస్తుందని ఆయన తెలిపారు. ఫ్లెక్సీలలో పార్టీ గుర్తులు కానీ ప్రచారం కానీ లేకపోయినప్పటికీ కొందరు కావాలనే తమపై కక్ష్య కట్టి ఇతర పార్టీల ఫ్లెక్సీలను సైతం తొలగించడం సరైన పద్ధతి కాదని ఆయన తెలిపారు. పండుగకు శుభాకాంక్షలు తెలియజేసే ఫ్లెక్సీలను ఎలా తొలగిస్తారు అని ఆయన అన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎలా పంపిణీ చేస్తారని ఆయన అన్నారు. ఇది సరైన పద్ధతి కాదని అధికారులు ప్రజాప్రతినిధులు ఆలోచించాలని ఆయన తెలిపారు.


Next Story

Most Viewed