- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
బీజేపీ అసమ్మతివాదులు నిరసన..

దిశ, నల్లగొండ బ్యూరో : ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ నల్గొండ జిల్లా కేంద్రానికి విచ్చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన ప్రసంగిస్తుండగా జిల్లా అధ్యక్షులుగా ఎంపిక చేయడం పట్ల బీజేపీ సీనియర్ నేతలు అసమ్మతి వాదులు జిల్లా బీజేపీ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పార్టీ ఎన్నికల కమిటీ నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర పార్టీ అధిష్టానం జిల్లా అధ్యక్షులు ఎన్నిక చేశారని విమర్శించారు.
వర్షిత్ రెడ్డి ఎన్నిక పై పునర్ ఆలోచన చేయాలని నిరసన చేశారు. పార్టీ రాష్ట్ర నేతలు అసమ్మతి వాదులకు నచ్చని ప్రయత్నం చేసిన అధ్యక్షులు మార్పు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్, ఎస్సీ మోర్చా రాష్ట్ర మాజీ కార్యదర్శి పోతేపాక సాంబయ్య, యువమోర్చ జిల్లా అధ్యక్షులు వంగూరు రాఖి, మాజీ కౌన్సిలర్లు రావిరాల వెంకటేశ్వర్లు ,బొజ్జ నాగరాజు, దాసరి సాయి యాదవ్, గుర్రం వెంకన్న, వందమంది నాయకులు పాల్గొన్నారు.