కాంగ్రెస్ పార్టీలో చేరిన బిల్యా నాయక్

by Disha Web |
కాంగ్రెస్ పార్టీలో చేరిన బిల్యా నాయక్
X

దిశ, దేవరకొండ : నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం చింతపల్లి మండలానికి చెందిన మాజీ కాంగ్రెస్ నాయకుడు కేతావత్ బిల్యా నాయక్ తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుండి దేవరకొండ నియోజకవర్గం టికెట్ ఆశించి బంగపడ్డ కేతావత్ బిల్యా నాయక్, కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపోవడంతో బీఎస్పీ తరఫున పోటీ చేశారు.

దీంతో పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించినందుకు గాను అప్పట్లో ఆయనపై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ అధిష్టానం పలువురి నేతల పై సస్పెన్షన్ ఎత్తివేయడంతో బిల్యా తిరిగి సొంతగూటికి చేరుకున్నాడు. బుధవారం మధ్యాహ్నం పీసీసీ ఛీప్ రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు నల్గొండ జిల్లా పార్టీ అధ్యక్షునిగా పనిచేసిన సమయంలో పీసీసీ చీఫ్ రేవంత్ అనుచరుడిగా పేరున్న బిల్యా కు ఇటీవల రేవంత్‌ను కలిసిన సమయంలో మీ రాజకీయ భవిష్యత్తును నేను చూసుకుంటానని పార్టీ గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలో పనిచేయాలని రేవంత్ అన్నట్లు సమాచారం. కాగా, ఇప్పటికే దేవరకొండ టికెట్ పై నేనావత్ బాలునాయక్, ధీమగా ఉండగా కొత్తగా తెరపైకి ఉస్మానియా జేఏసీ నాయకుడు డాక్టర్ రవి నాయక్ , నేనావత్ కిషన్ నాయక్, వడితే రమేష్ నాయక్, రామావత్ జగన్ లాల్ నాయక్, కూడా ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో బిల్యా నాయక్ కూడా పార్టీలో చేరడంతో టికెట్ ఎవరికి వస్తుందో ప్రజలు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఈసారి దేవరకొండలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయంలో అధిష్టానానికి తలనొప్పిగా మారే అవకాశం ఉంది. టిక్కెట్టు ఎవరు సంపాదిస్తారో చూడాలి?

కంటెంట్ రైటర్లు కావాలి!
సంచలన కథనాలతో తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోతున్న దిశ వెబ్‌సైట్‌లో పని చేయడానికి సీనియర్, జూనియర్ కంటెంట్ రైటర్లు కావాలి.
పొలిటికల్, వైరల్, సినిమా, బిజినెస్, లైఫ్‌స్టైల్ కంటెంట్ రాసే వారికి ప్రాధాన్యం ఉంటుంది. ప్రతిభను బట్టి వేతనం ఉంటుంది.
ఆసక్తి ఉన్నవాళ్లు నెంబరు 79958 66670 కు తమ బయోడేటా వాట్సాప్ చేయండి. లేదా
వాకిన్ ఇంటర్వ్యూ కోసం కింది అడ్రస్‌లో సంప్రదించగలరు.
దిశ, ఫస్ట్ ఫ్లోర్, లుంబిని రాక్‌డేల్ ఈనాడు ఆఫీసు వెనకాల సోమాజీగూడ, హైదరాబాద్.

Next Story

Most Viewed