మునుగోడులో అంబారాన్నంటిన బతుకమ్మ సంబరాలు

by Dishanational2 |
మునుగోడులో అంబారాన్నంటిన బతుకమ్మ సంబరాలు
X

దిశ, మునుగోడు: మునుగోడు మండల కేంద్రంలో ఆదివారం ఎంగిలిపువ్వు బతుకమ్మ సంబరాలు అంబరన్నాంటాయి. మునుగోడు పట్టణంలో ఉదయం నుండి భక్తి శ్రద్దలతో గౌరమ్మను పూజించుకుని బతుకమ్మను పెర్చుకున్నారు. సాయంత్రం 5 గంటలకు ఇండ్లలోనుండి ఒక్కొక్కరుగా బతుకమ్మల్తో మునుగోడు చౌరస్తాకి చేరుకున్నారు. ఒక్కొక్కరు కాస్త వేలాది మంది మహిళలు గౌరమ్మ బతుకమ్మలతో చౌరస్తా లో బతుకమ్మ ఆడారు. ఇసుక ఎస్తే రాలనంతగా మహిళలు బతుకమ్మలతో రావడంతో పూలపండుగతో మునుగోడు పులకరించింది. మునుగోడు చౌరస్థా నుండి బతుకమ్మలతో చండూరు రోడ్డు లో వున్న కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లడంతో రహదారి అంతా పూలతో పర్వశించింది.ర్యాలీగా ఆవరణకి చేరుకుని మహిళలంతా బతుకమ్మ ఆడారు.చిన్నా పెద్దా అనే తేడాలేకుండా పాటలకు తగ్గట్టు స్టెప్పులు వేస్తూ హోరేత్తించారు.

అందరితో కలిసి కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సతీమణి కోమటిరెడ్డి లక్ష్మి బతుకమ్మ ఆడారు. లక్ష్మి‌తో పాటు కోడలు తరుణ్య సంకీర్త్ రెడ్డి పాల్గొని బతుకమ్మ పాటలకు స్టెప్పులు వేశారు. వేల మంది మహిళలు బతుకమ్మ ఆడుతున్న ప్రాంతాన్ని కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి, మునుగోడు ఉప ఎన్నిక ఇంచార్జి వివేక్ వెంకటస్వామి సందర్శించి మహిళలకు అందరికి బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్గొండ ప్రసాద్ పిఎసిఎస్ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, జిల్లా నాయకులు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ,పాలకూరి యాదయ్య, మాధగోని రాజేష్ గౌడ్ ,మేకల ప్రమోద్ రెడ్డి, పాల్వాయి జితేందర్ రెడ్డి ,మునుగోడు సాయి, సురేష్, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed