కమ్యూనిటీ పోలీసింగ్ పై అవగాహన సదస్సు

by Aamani |
కమ్యూనిటీ పోలీసింగ్ పై అవగాహన సదస్సు
X

దిశ, హలియా : హాలియ మున్సిపాలిటీ పరిధిలోని స్థానిక 7,8,9 వార్డులలో హాలియ పోలీస్ వారి ఆధ్వర్యంలో జిల్లా ఎస్పీ అపూర్వ రావు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని ఎస్సై క్రాంతి కుమార్ ఏర్పాటు చేశారు.దానిలో భాగంగా హాలియ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాంధీ నాయక్ హాజరై మాట్లాడుతూ స్థానిక ప్రజలకు పలు విషయాలపై అవగాహన తెలిసేలా వివరించారు.వాటిలో భాగంగా గ్రామాలలో సీసీ కెమెరాల ఏర్పాటు,నేరాల నియంత్రణలో వాటి ప్రాముఖ్యత,ఆన్ లైన్ మోసాలు,బాల్య వివాహాలు,చేతబడి,బాల కార్మిక వ్యవస్థ, షీ టీమ్,సోషల్ మీడియా ఉపయోగాలు,వివిధ చట్టాలపై అవగాహన, ట్రాఫిక్ రూల్స్,గంజాయి వంటి మాధక ద్రవ్యాలు యువత పై ఎటువంటి ప్రభావం చూపుతుందో.కొత్తగా హాలియ మున్సిపాలిటీ నుంచి జాతీయ రహదారులు వెళ్తుండడంతో రోడ్డు ప్రమాదాలపై అవగాహన ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డుల ప్రజలు,యువత ఎక్కువ పాల్గొని చట్టాలపై అవగాహన తెలుసుకున్నారు.

Next Story