MLA: భద్రత కల్పించడంలో అధికారులు విఫలం

by Kalyani |
MLA: భద్రత కల్పించడంలో అధికారులు విఫలం
X

దిశ, మిర్యాలగూడ (దామరచర్ల): థర్మల్ పవర్ ప్లాంట్ కు భద్రత కల్పించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని, దొంగతనానికి పాల్పడిన నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం దామరచర్ల మండలం వీర్లపాలెం సమీపంలోని యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఉన్నత స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పవర్ ప్లాంట్ లో ఇప్పటికి రెండుసార్లు దొంగతనం జరిగిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఇందులో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దొంగతనం పాల్పడిన వారిలో ఎవరెవరు ప్రమేయం ఉందో వెంటనే నివేదిక అందజేయాలని సూచించారు. సమావేశంలో డీఎస్పీ రాజశేఖర్ రాజు, సిఐ వీరబాబు, పవర్ ప్లాంట్ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story